చీటాయపాలెంలో రోడ్డు ప్రమాదం

చీటాయపాలెంలో రోడ్డు ప్రమాదం

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.తొర్రూరు మండల చీటాయపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ర లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుల తండా వాసులుగా పోలీసులు గుర్తించారు. తొర్రూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వేప, తుమ్మ కర్రలను కొనుగోలు చేసిన ఓవ్యాపారి ఇక్కడి నుంచి రాత్రికి రాత్రే కర్రను తరలించాలనుకున్నారు. కొనుగోలు చేసిన కర్రను లోడ్ చేసి తరలిస్తుండగా స్థానికంగా ఉన్న ఎక్కలదాయమ్మ చెరుపు కట్టపై అదుపుతప్పి లారీ బోల్తా పడింది.

కట్టెల లోడుపై కూర్చున్న నలుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. క్యాబిన్‌లో కూర్చున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు కోసం ఆసుపత్రికి తరలించినటట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందినవారిని హర్యా, గోవింద్, మధు, దూతియాగా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రమాదం జరగగా తెల్లవారుజామున మూడు గంటలకు మృత దేహాలను వెలికి తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు.