ఫుట్ బాల్ ఫ్యాన్స్ కి పుతిన్ బంపరాఫర్ !

Russian President Putin give Bumper offer to Football audience

రష్యాలో దాదాపు నెలన్నరపాటు ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులను అలరించిన ఫిఫా వరల్డ్ కప్-2018 పోటీలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన పోరులో ఫ్రాన్స్ జట్టు క్రొయేషియాపై 4-2 తేడాతో విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. టోర్నీ సక్సెస్ కావడంతో హ్యాపీగావున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫుట్ బాల్ అభిమానులకు బంపరాఫర్ ఇచ్చేశారు. మ్యాచ్‌లను చూసేందుకు ‘ఫ్యాన్ ఐడీ’ కార్డులతో తమ దేశానికి వచ్చిన విదేశీయులు, ఈ ఏడాదంతా ఎలాంటి వీసా ఫీజులు చెల్లించకుండా ఎన్నిసార్లయినా రష్యా వచ్చి వెళ్లవచ్చని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.

ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు టికెట్ కొనుగోలు చేసిన విదేశీయులు, దేశంలో దిగగానే ఈ ‘ఫ్యాన్ ఐడీ’ ఇస్తారు. ఈ ఐడీలు మామూలుగా అయితే, ఈ నెల 25తో ఎక్స్ పైర్ అయిపోతాయి. ఇప్పుడీ ఫ్యాన్ ఐడీ చూపించి, సంవత్సరం చివరి వరకూ ఎన్నిసార్లయినా పర్యటించవచ్చని పుతిన్ ఆఫర్ ఇచ్చారు. ఇది పుతిన్ మైండ్ లో పుట్టిన ఈ బిజినెస్ ఆలోచన వల్ల తమ దేశానికి టూరిస్టుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.