గుండెను పిండేస్తోన్న వీడియో.. వైరల్..

అతనికి ఫుట్‌బాల్‌ ఆటే ప్రాణం. ఆ కుర్రాడు తాజాగా మృతి చెందాడు. దీంతో అతడి స్నేహితులు శవపేటికలో అతడి మృతదేహాన్ని తీసుకొచ్చి మైదానంలోనే చాలాసేపు ఉంచారు. గోల్ఫ్‌కు ఎదురుగా శవపేటికను పెట్టి ఒకరు ఫుట్‌బాల్‌ను కిక్‌ చేయగా అది శవపేటికకు బలంగా తగిలింది. అంతే అది నేరుగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. అయితే ఫుట్‌బాల్‌ అంటే ప్రాణంగా బతికిన ఆ కుర్రాడి మృతదేహం ఉన్న శవపేటికను తాకిన ఆ బాల్ ‌గోల్‌పోస్ట్‌కి వెళ్లడంతో అతడి స్నేహితులు కన్నీరు ఆపుకోలేకపోయారు. శవపేటికపై చుట్టూతా చేరి ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

కాగా  ఆ ఘటన చూసిన నెటిజన్లను ఉద్వేగానికి లోను చేస్తుంది. ఈ వీడియో తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. అతడు చివరి గోల్‌ వేశాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే మెక్సికోలో 16 ఏళ్ల ఫుట్‌బాల్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ మార్టినేజ్‌ ఈ మధ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వారి స్నేహితులను శోకసంద్రంలో ముంచింది.