పుట్టిన రోజున టీసర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్

పుట్టిన రోజున టీసర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ ప్రముఖులు. ఈ నేపథ్యం లోనే ఆయన తాజా సినిమా ప్రతీ రోజూ పండగే నుంచి కొత్త లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ లుక్‌లో ఫుల్ గ్లామర్ గా కనిపిస్తూ మెగా అభిమానులకు స్పెషల్ కిక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై తెరకెక్కుతోంది ‘ప్రతీ రోజు పండుగే’ మూవీ.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మామ మెగాస్టార్ చిరంజీవి కూడా పరిశీలించి ఓకే చేయడం విశేషం. దీంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు తాజాగా వస్తున్న అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆత్రుత పెంచేస్తున్నాయి.

ఈ సినిమాలో సత్యరాజ్ మనవడిగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. వీరిద్దరి నడుమ సాగే కొన్ని ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని టాక్. గత కొంతకాలంగా రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు. మరికొద్ది రోజుల్లో యూనిట్ అంతా ఫ్లయిట్ ఎక్కనుంది. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా నటిస్తోంది.