మోడీ “సబ్ కా విశ్వాస్”లో “శ్రీమంతుడు”

మోడీ “సబ్ కా విశ్వాస్”లో

శ్రీమంతుడు,భరత్ అనే నేను,మహర్షి వంటి ఇండస్ట్రీ హిట్లను పొందిన మహేష్బాబు సినిమాల్లోనే కాకుండా వ్యాపార ప్రకటనలలోనూ  ముందున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల అడ్వర్టయిజ్మెంట్లలో నటించిన మహేష్బాబు సామాజిక అంశాల పట్ల చైతన్యం ఉందనే చెప్పుకోవచ్చు.సొంత డబ్బులతో కనీస సదుపాయలను కల్పించి తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు.30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించి అత్యధికంగా ఆదాయాన్ని అందుకున్న ఘనత టాలీవుడ్ లో మహేష్ బాబుదే.

ఓ చిన్న అడ్వర్టయిజ్మెంట్ ను ప్రజలకు అవగాహన కల్పిస్తూ కేంద్రవాణిజ్య మంత్రిత్వశాఖ మహేష్ బాబుపై చిత్రీకరించింది.హైదరాబాద్ జోన్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ వారు రూపోందించిన అడ్వర్టయిజ్ మెంట్ ఇది. 100సెకెన్ల పాటు ఉండి కొత్తగా అమల్లోకి తెచ్చిన పథకం “సబ్ కా విశ్వాస్” గురించి రూపొందించింది. “మంచి నిర్ణయం ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది, అందుకే మన కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది” అంటూ మహేష్ బాబు ఈ ప్రకటనలో కనిపిస్తారు.”సబ్ కా విశ్వాస్” వాణిజ్య, కస్టమ్స్ పన్నులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవడానికి ఉద్దేశించినది .