ఎన్టీఆర్‌ బయోపిక్‌ టైటిల్‌ రిజిస్ట్రర్‌ చేయించిన సాయికొర్రపాటి

sai korrapati register to Balakrishna NTR Biopic movie title

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన కొడుకు బాలకృష్ణ ఒక బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి దర్శకుడిగా తేజను అనుకున్నట్లుగా తెలుస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో పొలిటికల్‌ డ్రామాను దర్శకుడు తేజ బాగా పడివ్వడం జరిగింది. అందుకే తేజాను ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపిక చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. తేజా కూడా అందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని ఒక తెలుగు దేశం నాయకుడు నిర్మించబోతున్నట్లుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని బాలయ్యకు సన్నిహితుడు అయిన సాయి కొర్రపాటి నిర్మించబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించి ఆయన ఏర్పాట్లు ప్రారంభించాడు. తన వారాహి చలన చిత్రం బ్యానర్‌పై ‘ఎన్టీఆర్‌’ అనే టైటిల్‌ను సాయి కొర్రపాటి నిర్మించాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సాయి కొర్రపాటి సిద్దంగా ఉన్నాడు.

బాలయ్యతో ఇప్పటికే ‘లెజెండ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను నిర్మించిన సాయి కొర్రపాటి మరోసారి ఈ సినిమాతో బాలయ్యకు హిట్‌ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ చిత్రం కథ ఎలా ఉంటుంది, అసలు ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ముగిస్తారు అనే ఆసక్తికర చర్చ సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా జరుగుతుంది. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను బాలయ్య కంటే ముందు వర్మ తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బాలయ్య సినిమాకు వర్మ సినిమాకు పూర్తి విభిన్నంగా ఉంటుందని కొందరు అంటున్నారు.