రామ్‌, బెల్లంకొండ ‘రభస’ సెటిల్‌ అయ్యింది

Ram and Belamkonda Suresh War Settled

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
గత కొంత కాలంగా హీరో రామ్‌, నిర్మాత బెల్లంకొండ సురేష్‌ల మద్య వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. వీరిద్దరి కలయికలో చాలా సంవత్సరాల క్రితం ‘కందిరీగ’ చిత్రం తెరకెక్కింది. ఆ సినిమా సక్సెస్‌ అయిన నేపథ్యంలో మరో సినిమాను రామ్‌తో చేసేందుకు నిర్మాత బెల్లంకొండ కోటి రూపాయల అడ్వాన్స్‌ను కూడా ఇవ్వడం జరిగింది. కందిరీగ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ ఒక స్క్రిప్ట్‌ను సిద్దం చేసి రామ్‌కు వినిపించడం, అందుకు రామ్‌ ఓకే చెప్పడం జరిగిపోయింది. ఆ సమయంలోనే అదే స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు కూడా నిర్మాత బెల్లంకొండ వినిపించాడు. ఎన్టీఆర్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆ స్క్రిప్ట్‌తో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. 

సంతోష్‌ శ్రీనివాస్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో బెల్లంకొండ సురేష్‌ నిర్మాణంలో ‘రభస’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా రామ్‌ మాత్రం తనకంటూ చెప్పిన కథను వేరే హీరోతో చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు చెప్పకుండా కథను అటు తీసుకు వెళ్లినందుకు, తనను పక్కకు పెట్టినందుకు తాను తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేది లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. అప్పటి నుండి కూడా రామ్‌ను బెల్లకొండ అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బును అడుగుతూనే ఉన్నాడు. కాని రామ్‌ మాత్రం తాను ఇవ్వను అంటూ వస్తున్నాడు. 

తాజాగా రామ్‌ హీరోగా నటించి నిర్మించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అనే చిత్రం విడుదల అయ్యింది. ఆ సినిమా విడుదల అడ్డుకోవాలంటూ నిర్మాతల మండలిలో బెల్లంకొండ సురేష్‌ అపీల్‌ చేయడం జరిగింది. తనకు ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చే వరకు సినిమాను విడుదల కానివ్వొద్దు అంటూ నిర్మాతల మండలి పెద్దలను కోరడంతో వివాదం పెద్దది అవుతుందని, తన సినిమా విడుదల ఆగిపోతుందని రామ్‌ భావించి బెల్లంకొండకు చెల్లించాల్సిన మొత్తంను ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. దాంతో సినిమా ఎలాంటి అవరోధాలు లేకుండా విడుదల అయ్యింది. ఇన్నాళ్లకు రామ్‌, బెల్లంకొండల రభస వివాదం కొలిక్కి వచ్చింది.