శైలజ రెడ్డి అల్లుడు వాయిదా వేశారు, ఎందుకంటే…!

Sailaja Reddy Alludu Movie Audio Launch Date Postponed

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు మారుతి దర్శకత్వం వహించాడు. ఆగస్టు 31న ఈ చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా రెండు నెలల క్రితమే ఫిక్స్‌ చేశారు. చిత్రీకరణ కూడా పూర్తి చేసి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో సినిమా వాయిదా వేయడం ఏంటా అని ఆశ్చర్య పోతున్నారా.. సినిమా వాయిదా పడటం లేదు, ముందుగా అనుకున్నట్లుగా ఆగస్టు 31న సినిమా విడుదల అవుతుంది. మేము చెబుతున్నది ఆడియో వేడుక గురించి ఈనెల 19న ఆడియో వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 19న ఆడియో వేడక లేదని తేలిపోయింది.

naga chaitanya

‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంను ఈనెల 31న విడుదల చేయబోతున్నారు కనుక, పబ్లిసిటీ పీక్స్‌లో ఉండేలా విడుదల తేదీకి దగ్గరగా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా విడుదలకు వారం ముందు అంటే 22వ తారీకున ‘శైలజ రెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్‌ వేడుక జరుపనున్నారు. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషించడం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక అనుఎమాన్యూల్‌ పాత్ర మరియు ఆమె అందం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

naga-chaitanya