చైతూ, సమంతల ‘మజిలీ’ ఏంటీ?

samantha and naga chaitanya movie title As majili

అక్కినేని జంట నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత నటిస్తున్న మొదటి చిత్రంకు ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి అయిన విషయం తెల్సిందే. ‘నిన్ను కోరి’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ అక్కినేని జంట మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈయన మరోసారి విభిన్నమైన ప్రేమ కథను, పెళ్లితో ముడివేసి రెడీ చేసుకోవడం జరిగింది. ఈ చిత్రంలో నాగచైతన్య మరియు సమంతలు భార్య భర్తలుగా కనిపిస్తారని, వీరిద్దరి మద్యలోకి ఒక అమ్మాయి ఎంట్రీ ఇవ్వడం, ఆ అమ్మాయి కారణంగా సంసార జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే కథాంశంతో సినిమా తెరకెక్కుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి ‘మజిలీ’ అనే విభిన్నమైన టైటిల్‌ను దర్శకుడు ఖరారు చేయడం, నిర్మాత రిజిస్ట్రర్‌ చేయించడం జరిగిపోయింది.

majili

‘మజిలీ’ టైటిల్‌పై భిన్న స్పందన వస్తుంది. మజిలీ అనే పదం కాస్త విభిన్నంగా ఉందని, క్యాచీగా లేదని, అర్థం తెలియని టైటిల్స్‌ పెట్టడం వల్ల సినిమాపై ప్రభావం పడుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం విభిన్నమైన కథాంశంకు ఆకట్టుకునే టైటిల్‌ను దర్శకుడు ఖరారు చేశాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ‘మజిలీ’ టైటిల్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగచైతన్య మరియు సమంతలు వేరు వేరుగా సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే నెలతో వారి సినిమాలు పూర్తి అవ్వనున్నాయి. అప్పుడు ఇద్దరు కలిసి ‘మజిలీ’ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రంను వచ్చే ఏడాదిలో విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. మజిలీ అంటే చివరి పాయింట్‌ అని అర్థం. సమంత, చైతన్యల ప్రేమ, పెళ్లి ఏ మజిలీ చేరుతుందో చూడాలి అంటే సినిమా వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

samantha-and-naga-chaitanya