స్టార్‌ హీరోల సరసన గోవిందం…!

Geetha Govindham Movie First Day Collection 10 Crores

ఈమద్య కాలంలో సినిమా సక్సెస్‌ను, కలెక్షన్స్‌ను ఓపెనింగ్స్‌ నిర్ణయించేస్తున్నాయి. మొదటి రెండు మూడు రోజుల్లోనే దాదాపుగా బడ్జెట్‌ను రికవరీ చేయగలిగే చిత్రాలు మాత్రమే సక్సెస్‌గా చెప్పుకోవచ్చు. లేదంటే ఆ తర్వాత పైరసీ బారిన పడటం, కలెక్షన్స్‌ తగ్గడం జరుగుతుంది. అందుకే స్టార్‌ హీరోలు అంతా కూడా భారీ ఎత్తున సినిమాలను విడుదల చేయాలని కోరుకుంటున్నారు. ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేయడం వల్ల తక్కువ రోజుల్లోనే ఎక్కువ వసూళ్లు నమోదు అవుతాయి. ఇక ప్రతి స్టార్‌ హీరో కూడా ఈమద్య కాలంలో మొదటి రోజు 10 కోట్ల టార్గెట్‌ను పెట్టుకుంటున్నాడు. 10 కోట్లు సాధించింది అంటే అది స్టార్‌ హీరో మూవీగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా గీత గోవిందం చిత్రం మొదటి రోజే 10 కోట్లకు చేరువ అయ్యే కలెక్షన్స్‌ను సాధించింది.

vijaydevarakonda

‘గీత గోవిందం’ చిత్రం మొదటి రోజు ఏకంగా 9.66 కోట్లను వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్‌ పండితులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. నిన్న పబ్లిక్‌ హాలీడే అవ్వడంతో పాటు, అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం, యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ప్రమోషన్స్‌ చేయడం వల్ల సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందుకే ఈ చిత్రానికి భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు భారీగా కలెక్షన్స్‌ వస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశించారు. కాని ఏకంగా 10 కోట్లకు చేరుగా ఈ చిత్రం షేర్‌ నిలుస్తుందని మాత్రం ఏ ఒక్కరు ఊహించలేదు. ఇంతటి సంచలన వసూళ్లు సాధించిన ఈ చిత్రం ముందు ముందు మరెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

geetha