రంగస్థలం వల్ల సైరా వాయిదా?

Saira Movie Shooting Postponed In Cinematographer Ratna Velu Absence
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం కోసం నెలల తరబడి ఎదురు చూసిన తర్వాత షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యి నెలలు గడుస్తున్నా రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించలేదు. తాజాగా ‘సైరా’ రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. చిరంజీవి మేకప్‌ విషయంలో సినిమాను వాయిదా వేయడం జరిగిందని కొందరు అంటున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే సినిమాటోగ్రఫర్‌ రత్నమే రంగస్థలం పనిలో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రం షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ముందుగా అనుకున్న ప్రకారం ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే సినిమాటోగ్రఫర్‌ పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ వర్క్‌ను పూర్తి చేయాలి. కాని రంగస్థలం అనుకున్న సమయం కంటే ఎక్కువ తీసుకోవడంతో పాటు, నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఆ కారణంతో సైరాకు కూడా సినిమాటోగ్రఫర్‌గా చేస్తున్న రత్నవేలు రాలేక పోతున్నాడు. సినిమాటోగ్రఫర్‌ లేని కారణంగా సినిమా షూటింగ్‌ను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈనెల చివర్లో లేదా మార్చి మొదటి వారంలో అయినా కేరళలో సైరా చిత్రం రెండవ షెడ్యూల్‌ను ప్రారంభిస్తామని మెగా వర్గాల వారు చెబుతున్నారు. రీ షెడ్యూల్‌ డేట్‌ను త్వరలోనే దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఖరారు చేస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.