మెగా హీరో వద్దకు నాని చిత్రలహరి

Sai Dharam Tej Replaces Nani In Chitralahari movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాని హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అందుకోసం కిషోర్‌ తిరుమల స్క్రిప్ట్‌ సిద్దం చేస్తున్నాడని, నాని డేట్లు కూడా ఇచ్చాడని, త్వరలో పట్టాలెక్కబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఆ ప్రాజెక్ట్‌ నుండి నాని తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి నాని ఒక చిత్రం చేయబోతున్నాడు. దాంతో పాటు మరో రెండు పెద్ద చిత్రాలకు నాని కమిట్‌ అయ్యాడు. అందుకే ఈ చిత్రాన్ని నాని లైట్‌ తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. దానికి తోడు కిషోర్‌ తిరుమల తీసుకు వచ్చిన ఫైనల్‌ స్క్రిప్ట్‌ కూడా నానిని తృప్తి పర్చలేదు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నాని తిరష్కరించిన ‘చిత్రలహరి’ చిత్రాన్ని మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతుంది. సాయి ధరమ్‌ తేజ్‌ ఇటీవల వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు. అయినా కూడా ఈయనతో సినిమాలు చేసేందుకు దర్శకులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కరుణాకరన్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ముగింపు దశకు చేరుకోగా, ఆ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ తర్వాత కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో నాని చిత్రాన్ని చేయనున్నట్లుగా తెలుస్తోంది. నాని మంచి కథలు ఎంచుకుంటాడనే నమ్మకం అందరిలో ఉంది. అందుకే నాని ఓకే చెప్పిన కథనే సాయి ధరమ్‌ తేజ్‌ చేయబోతున్నాడు. స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయించి సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ‘చిత్రలహరి’ అయినా తేజూకు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.