తానేం కన్నీరు పెట్టుకోలేదట

Samantha Crying at Hello Pre-release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని కుటుంబంలో సమంత అడుగు పెట్టిన తర్వాత ఆ కుటుంబంకు చెందిన వేడుకలో పాల్గొనడం ‘హలో’నే మొదటిది. తాజాగా ‘హలో’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఆ సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌లు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. వారితో పాటు కొత్త పెళ్లి జంట అయిన నాగచైతన్య మరియు సమంతలు కూడా కార్యక్రమంలో స్పెషల్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ‘హలో’ ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి, చరణ్‌ కంటే కూడా అధికంగా చైతూ, సమంతల జోడీని ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ చూశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సమంత స్టేజ్‌పైకి వెళ్లిన సమయంలో కన్నీరు పెట్టుకుంది అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది.

నాగచైతన్య గురించి నాగార్జున మాట్లాడుతున్న సమయంలో సమంత కళ్లలో నీరు వచ్చినట్లుగా అనిపించింది. ఆమె మెల్లగా తన కన్నీరు కూడా తూడ్చుకున్నట్లుగా వీడియోల్లో కనిపించింది. ఈ విషయమై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సమంత కన్నీరు పెట్టుకుందని, సమంత కన్నీరుకు కారణం ఏంటనీ ఏంటో ఏంటో కథనాలు వచ్చాయి. దాంతో సమంత ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తాను స్టేజ్‌పై కన్నీరు పెట్టుకోలేదని చెప్పుకొచ్చింది.

తాను కన్నీరు పెట్టుకున్నట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉందని చెప్పుకొచ్చింది. కళ్లకు ఇన్ఫెక్షన్‌ అవ్వడం వల్ల కళ్లలో నీరు ఉన్నట్లుగా ఉందని, అంతే తప్ప తాను కన్నీరు పెట్టుకోలేదని చెప్పుకొచ్చింది. సమంత క్లారిటీ ఇచ్చినా కూడా కొందరు మాత్రం ఆ విషయాన్ని పదే పదే సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూనే ఉన్నారు.