దేవుడా… మాజీ ప్రియుడిపై యువతి రేప్ !

Samantha rey Miyars Rapes to her Boy Friend in America

మీరు చదివింది నిజమే మన దేశంలో ప్రియురాళ్లపై ప్రియులు అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు రోజూ వింటూనే ఉంటాం. అమెరికాలో మాత్రం సీన్ రివర్స్‌లో ఒక ఘటన జరిగింది. ఓ మాజీ ప్రియుడిపై ఓ ప్రియురాలి కత్తితో బెదిరించి మరీ అత్యాచారం చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే… అమెరికా మోంటానాలో సమంత రే మియర్స్‌(19) అనే యువతి గ్రేట్‌ఫాల్స్‌కు ఓ యువకుడితో ఏడేళ్ళపాటు సహజీవనం చేసింది. అయితే, సమంత సైకోలా ప్రవర్తిస్తుండటంతో కొంతకాలం క్రితం బ్రేకప్‌ చెప్పేశాడు. దీంతో ఆమె బాధితుడిపై కక్షగట్టిన ప్రియురాలి పగతీర్చుకోవాలని నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో బాధితుడు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన సమంత రే మియర్స్… లోపలికి చొరబడి తలుపుచాటున దాక్కుంది. అంతేకాకుండా అతడి గొంతుపై కత్తిపెట్టి బెదిరించింది. అతడు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె అతని చేతిని గట్టిగా కొరికీ…. అత్యాచారానికి పాల్పడిందని బాధితుడు వాపోయాడు.

ఆ సమయంలో అతడి చేతిని కొరకడమేకాక, అత్యాచారం అనంతరం మంచంపై మూత్రవిసర్జన చేసింది. అతడు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. బాధితుడు 911 ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమిచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మియర్స్‌ను అరెస్ట్ చేసి, విచారించగా ఆమె వాదన మరో విధంగా ఉంది. అతడే తనను ఇంటికి ఆహ్వానించి, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఫిర్యాదును కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. బాధితుడి చేయిపై కొరికిన గాయం గుర్తులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.