హీరో సిద్ధార్థ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంతా

హీరో సిద్ధార్థ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంతా

నాగచైతన్య కన్నా ముందు హీరో సిద్ధార్థ్‌తో సమంత ప్రేమలో పడినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయనతో సమంత డేటింగ్ కూడా చేసినట్టు సమాచారం. కానీ, వీరి రిలేషన్‌షిప్‌ ఎంతో కాలం నిలవలేదు.సిద్ధార్థ్‌కు బ్రేకప్ చెప్పిన తరవాత సమంతకు నాగచైతన్య పరిచయం అయ్యారు. ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. అయితే, సిద్ధార్థ్‌తో ప్రేమ వ్యవహారం గురించి తాజాగా సమంత స్పందించారు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్ 2019గా నిలిచిన సందర్భంగా సమంతను ఓ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఇంటర్వ్యూ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ బోయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ గురించి మాట్లాడుతూ సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధార్థ్‌తో విడిపోవడం ఎంతో మంచిదైందని అన్నారు. అతనితో సంబంధాన్ని కొనసాగించి ఉంటే తన జీవితం మరో సావిత్రి జీవితంలా అయిపోదేని వ్యాఖ్యానించారు.‘‘సావిత్రి మాదిరిగానే నేను కూడా నా వ్యక్తిగత జీవితంలో ఒక సంక్షోభంలో కూరుకుపోయుండేదాన్ని. కానీ, దేవుడి దయవల్ల మొదట్లోనే వాస్తవాలు ఏంటో గ్రహించాను. వెంటనే ఆ సంబంధం నుంచి బయటపడ్డాను. ఆ తరవాత నా జీవితంలోకి నాగచైతన్య వంటి మంచి వ్యక్తి వచ్చారు. ఆయన ఒక ఆణిముత్యం’’ అని సమంత చెప్పుకొచ్చారు. మరి దీనిపై సిద్ధార్థ్ ఎలా స్పందిస్తారో చూడాలి.