నా జీవితం సావిత్రి జీవితంలా అయ్యేది

samantha talks about savitri life

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మహానటి సావిత్రి జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. ఆమె చేసిన సినిమాలతో స్టార్‌ అయ్యింది. కాని తీసుకున్న నిర్ణయాల వల్ల చివరకు జీరో అయ్యారు. అలాంటి జీవితంలో కూడా సావిత్రి ఎంతో ఉన్నతంగా జీవించారు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో ఆమె గురించిన పూర్తి విషయాలు చూపించడం జరిగింది. ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు జెమిని గణేషన్‌ను ప్రేమించి పెళ్లిచేసుకోవడం. ఆమె ఆ పని చేయకుంటే ఇప్పటి వరకు కూడా హాయిగా జీవితాన్ని గడిపేస్తూ ఉండేదేమో అంటూ కొందరు అంటున్నారు. సమంత జీవితం కూడా సావిత్రి జీవితం మాదిరిగా మారే ప్రమాదం నుండి బయట పడటం జరిగింది. సమంత గతంలో హీరో సిద్దార్థ్‌ను ప్రేమించి వివాహం చేసుకోవాలని భావించింది. అందుకోసం ఇద్దరు కూడా కుటుంబ సభ్యును ఒప్పించడం జరిగింది.

పెళ్లికి సిద్దం అయిన వీరిద్దరు ఏదో కారణం వల్ల విడిపోయారు. వీరి బ్రేకప్‌ ఆ మద్య భారీ సంచనంకు తెర లేపింది. సమంత, సిద్దార్థ్‌లు ఇద్దరు కూడా వారి ప్రేమ విషయంపై ఎప్పుడు స్పందించలేదు. అయితే తాజాగా సమంత ఆ విషయాన్ని గురించి మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. తాను కూడా సావిత్రిగారిలా మారిపోయే ప్రమాదం నుండి తప్పించుకున్నాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సిద్దార్థ్‌ గురించే అంటూ కొందరు అంటున్నారు. సమంత ఇంకా మాట్లాడుతూ జీవితంలో పెద్ద ప్రమాదం తప్పింది, నా జీవితంలోకి చైతూ రావడం నా పూర్వ జన్మ అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది. చైతూ తన విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు అని, అన్ని విషయాల్లో కూడా శ్రద్ద చూపించి తనకు పూర్తి స్వేచ్చను ఇచ్చాడు అంటూ సమంత చెప్పుకొచ్చింది.