పెళ్లికూతురి హోదాలో స‌మంత ఛాటింగ్…

samantha twitter Chatting with fans

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ స‌మంత ఫ్యాన్స్ కోసం సోష‌ల్ మీడియాలో స‌మ‌యం కేటాయిస్తూనే ఉంది. పెళ్లికూతురి హోదాలో స‌మంత త‌న ఫ్యాన్స్ ను చాటింగ్ కు ఆహ్వానించింది. త‌క్ష‌ణ‌మే ఫ్యాన్స్ అనేక ర‌కాల ప్ర‌శ్న‌ల‌తో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశారు. వారి ప్ర‌శ్న‌ల‌కు స‌మంత ఓపిగ్గా స‌మాధానాలిచ్చింది. అభిమానులు స‌మంత‌కు పెళ్లి శుభాకాంక్ష‌లు చెప్పారు. ఆమె జీవిత‌మంతా సంతోషంగా సాగిపోవాల‌ని ఆకాంక్షిస్తూ ట్వీట్ లు చేశారు.

ఓ అభిమాని స‌మంత‌కు ఓ హామీ ఇచ్చాడు. పెళ్ల‌య్యాక నాగ‌చైత‌న్య త‌న‌ను ఏమ‌న్నా ఇబ్బందిపెడితే… శామ్ ఆర్మీ అంతా త‌న వెంట ఉంటుంద‌ని ఆ అభిమాని స‌మంత‌కు అభ‌య‌మిచ్చాడు. దానికి స‌మంత సో క్యూట్ అని రిప్ల‌య్ ఇచ్చింది. పెళ్ల‌య్యాక న‌టిస్తావా అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు అవున‌ని స‌మాధాన‌మిచ్చింది. గౌత‌మ్ మీన‌న్ ఏ మాయ చేశావే సినిమాతో ఒక‌రికొక‌రు ప‌రిచ‌య‌మైన నాగ‌చైత‌న్య‌, స‌మంత త‌ర్వాత ప్రేమ‌లో ప‌డి… ఇప్పుడు పెళ్లిపీట‌లెక్కుతున్నారు. దీనిపై అభిమాని ఒక‌రు స‌మంత‌ను స‌ర‌దాగా ఓ ప్ర‌శ్న వేశాడు.

మీకు పుట్ట‌బోయే బిడ్డ‌కు గౌత‌మ్ మీన‌న్ అని పేరు పెడ‌తారా అని ఆ అభిమాని అడ‌గ్గా… స‌మంత దానికి స‌మాధానంగా న‌వ్వుతున్న ఎమోజీలు పోస్ట్ చేసింది. మ‌రో అభిమాని పెన్సిల్ తో వేసిన నాగ‌చైత‌న్య‌, స‌మంత చిత్రాన్ని పోస్ట్ చేశాడు. దీనికి స‌మంత వావ్… థాంక్యూ అని ధ‌న్యావాదాలు తెలియ‌జేసింది. త‌నకు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌న ప‌క్క‌న నిల‌బ‌డిన అంద‌రికీ స‌మంత కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది.

 samantha twitter Chatting with fans

 samantha twitter Chatting with fans  samantha twitter Chatting with fans  samantha twitter Chatting with fans  samantha twitter Chatting with fans  samantha twitter Chatting with fans