ముగ్గురిలో సంపూ కాస్త బెటర్‌

Sampoornesh Babu VIRUS Movie is better

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

నేడు ప్రేక్షకుల ముందుకు మూడు చిత్రాలు వచ్చాయి. అవి ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌ తనయుడు గంటా రవి నటించిన ‘జయదేవ్‌’, సంపూ నటించిన ‘వైరస్‌’ మరియు ‘ఖయ్యూం భాయ్‌’. ఈ మూడు చిత్రాల్లో ఏ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు లేవు. దాంతో మరో వారం కూడా అల్లు అర్జున్‌ డీజేతో దుమ్ము లేపడం ఖాయం అని అంతా భావించారు. అనుకున్నట్లుగానే మూడు సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ‘డీజే’ సందడి తగ్గకుండానే విడుదలైన ఈ మూడు చిత్రాల్లో ‘వైరస్‌’ కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉంది. 

సంపూర్నేష్‌బాబు సినిమాలు అనగానే ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆశిస్తారు. ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తున్నారో అదే వైరస్‌ చిత్రంలో చూపించడం జరిగింది. సంపూ గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంతగా నచ్చక పోవచ్చేమో కాని, మాస్‌ ఆడియన్స్‌, కామెడీని మాత్రమే కోరుకునే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. మొత్తంగా చూస్తే వైరస్‌ సినిమా ఒక సాదా సీదా ఎంటర్‌టైనర్‌. అయితే మిగిలిన రెండు చిత్రాలతో పోల్చితే ఖచ్చితంగా మంచి చిత్రంగా చెప్పుకోవచ్చు. అయితే డీజే సందడిని మాత్రం ఈ సినిమా అడ్డుకుంటుందనే నమ్మకం లేదు.

మరిన్ని వార్తలు