కట్టప్ప లాంటి పాత్రలో టాప్ డైరెక్టర్ !

Samuthirakani In RRR

దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ ల కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఇప్పటివరకు హీరోయిన్స్ గా ఎవరు నటిస్తున్నారు అనేది బయటకు పొక్కలేదు. కీర్తి సురేష్ అదితి రావ్ హైదరి లాంటివాళ్ళు నటిస్తున్నారని గాసిప్స్ వచ్చినా సరే అధికారిక ప్రకటన అయితే వెలువడ లేదు. అయితే బాహుబలి సిరీస్లో రాజమౌళి సృష్టించిన కట్టప్ప పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది ఇప్పుడు కూడా అంతే ప్రాధాన్యత ఉన్న పాత్రను ‘ఆర్ ఆర్ ఆర్’లో రాజమౌళి డిజైన్ చేశారట. ఆ పాత్రకు తమిళ దర్శకుడు, నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సముద్రఖనిని ఎంపిక చేసుకున్నారనీ ప్రచారం జరిగింది.

ఈ సినిమా ద్వారా సముద్ర ఖని తెలుగు తెరకు పరిచయమవుతున్నారుని వార్తలు కూడా వచ్చాయ. ఈ వార్తల మీద సముద్రఖని స్పందించారు. ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను రాజమౌళి ఎంపిక చేసిన కాని చెప్పారు. ‘నా సినిమా నడోడిగల్ చూసిన తరవాత రాజమౌళి సార్ నాకు ఒక పెద్ద మెసేజ్ పంపారు. అప్పటి నుంచి మేమిద్దం టచ్‌లో ఉన్నాం. ఇటీవల ఆయన ఇంటికి నన్ను ఆహ్వానించారు. ఆయన కుటుంబసభ్యులను నాకు పరిచయం చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో నన్ను ఓ ప్రధాన పాత్రలో నటించమని అడిగారు. నేను వెంటనే అంగీకరించాను’ అని సముద్రఖని వివరించారు.