హీరోయిన్ హన్సికకి గాయం !

తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దేశముదురు భామ హన్సికకి తెలుగు కంటే తమిళ భాషలో ఎక్కువ క్రేజ్ వచ్చింది. దీంతో క్రేజీ హీరోయియిన్ గా అక్కడే సెటిలయ్యింది. తెలుగులో కన్నా తమిళంలో ఆమెకి ఎక్కువగా అవకాశాలు రావడంతో, అక్కడే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా చెలామణీ అవుతోంది. అడపా దడపా తెలుగు తెరపై కూడా మెరుస్తూనే వచ్చి 49 సినిమాలు పూర్తి చేసి ఇప్పుడు 50వ సినిమాగా ఒక తమిళ సినిమా చేస్తోంది. ఆమె 50వ చిత్రంగా ‘మహా’ రూపొందుతోంది. నూతన దర్శకుడు జమీల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో జరిగే కథ ఇది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా, హన్సిక జారిపడిపోవడంతో ఆమె చేతికి గాయమైందట. అయినా హన్సిక ఆ గాయాన్ని లెక్క చేయకుండా షూటింగులో పాల్గొన్నట్టుగా చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ మధ్య ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్త్తే అది వివాదాన్ని సృష్టించి పెట్టింది.