ఇసుక డోర్ డెలివరీ సదుపాయం

ఇసుక డోర్ డెలివరీ సదుపాయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తీసుకున్న కీలకమైన నిర్ణయం ప్రకారం ఆంద్రప్రదేశ్ లో నేటి నుండి ఇసుక డోర్ డెలివరీ సదుపాయం అమలవనుంది. ఈమేరకు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టును నేడు అధికారికంగా అమలులోకి తీసుకురానున్నారు. కాగా ముందుగా కృష్ణా జిల్లాలో ఇది అమలు చేయనున్నారు. కాగా ఈమేరకు ఇసుకను వారి ఇళ్లల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీఎండీసీనే చర్యలు తీసుకోనుందని సమాచారం. ఇకపోతే ఎవరికైతే ఇసుక అవసరమవుతుందో, వారు వారి నిర్మాణానికి సంబంధించిన వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచి, మ్యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తే ఇసుక ఆ ప్రదేశానికి చేరిపోయేలా అధికారులు చర్యలు చేపట్టారు.

అయితే ఇసుక డోర్ డెలివరీలో సంబంధిత వినియోగదారులు బుకింగ్‌ కోసం అయ్యే ఖర్చు, రవాణా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కాగా 20 కిలోమీటర్ల దూరం వరకు టన్ను ఇసుకకు కిలోమీటరుకు రూ.6.60 రవాణా ఛార్జీ చెల్లించాలి. 30 కిలోమీటర్ల దూరం అయితే కిలోమీటరుకు రూ.6, 30 కిలోమీటర్లకుపైన అయితే కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వాసులు చేయాలనీ నిర్ణయించుకున్నారు. కాగా సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వలన భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.