సంక్రాంతి 2025 టాలీవుడ్ లో మరింత పోటీ…?

సంక్రాంతి 2025 టాలీవుడ్ లో మరింత పోటీ...?
cinema news

టాలీవుడ్ మూవీ దగ్గర అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ సమయం ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. మరి ఈ సంక్రాంతి సీజన్ అంటే ఒకో ఏడాది దానికి మించి రసవత్తరంగా మారుతున్నది . అయితే ఈ ఏడాది 2024 సంక్రాంతి పోటీ అయితే పలు మూవీ ల థియేటర్స్, వసూళ్లు, మీటింగులు అంటూ చాలా రసవత్తరంగా మారగా దీనికి మించిన సంక్రాంతి సీజన్ వచ్చే ఏడాది రాబోతుంది అని చెప్పాలి.

అది కూడా ఈ సంక్రాంతి నుంచే పలు మూవీ లు వచ్చే ఏడాది సంక్రాంతికి ఫిక్స్ అయ్యిపోతుండడం ఆ టైం ని ఇప్పుడు నుంచే హీటెక్కించడం కూడా స్టార్ట్ చేస్తుంది. మెయిన్ గా వచ్చే ఏడాది పలు సీక్వెల్ మూవీ లు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. వీటిలో ఆల్రెడీ దిల్ రాజు శతమానం భవతి అఫీషియల్ గా ఫిక్స్ కాగా టాలీవుడ్ సెన్సేషనల్ హిట్స్ అఖండ పార్ట్ 2 అలాగే లేటెస్ట్ హిట్ హను మాన్ 2 కూడా అదే సమయాన్ని టార్గెట్ చేస్తున్నాయని తెలుస్తుంది .

ఇక వీటిని మించి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరో బిగ్గెస్ట్ మూవీ “విశ్వంభర” కూడా ఇదే సమయానికి వస్తున్నట్టుగా మేకర్స్ ఫిక్స్ చేశారు. దీనితో వచ్చే ఏడు సంక్రాంతి మాత్రం ఇప్పుడు సంక్రాంతికి మించే ఉండబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ సీక్వెల్స్ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉన్నది .