“సప్త సాగరాలు దాటి 2” ఓటిటి డేట్ లాక్?

“సప్త సాగరాలు దాటి 2” ఓటిటి డేట్ లాక్?
Sapta Sagaralu Dati

రీసెంట్ గా కన్నడ టాలెంటెడ్ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ రుక్మిణి వసంత్, చైత్ర జె ఆచర్ లు కాంబినేషన్ లో దర్శకుడు హేమంత్ ఎం రావు తెరకెక్కించిన సినిమా “సప్త సాగరాలు దాటి – సైడ్ బి” కోసం అందరికీ తెలిసిందే. మరి సైడ్ 1 కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ గానే ఆకట్టుకుంది.

“సప్త సాగరాలు దాటి 2” ఓటిటి డేట్ లాక్?
Sapta Sagaralu Dathi

కన్నడ సహా తెలుగులో కూడా పర్వాలేదనిపించింది ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డేట్ లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు కూడా ప్రైమ్ వీడియో వారే సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుండగా అందులో ఈ చిత్రం ఈ డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ కూడా రానుంది. ఇక ఈ చిత్రానికి చరణ్ రాజ్ బ్యూటిఫుల్ సంగీతం అందించగా కన్నడలో రక్షిత్ శెట్టి నిర్మాణం వహించగా తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు విడుదల చేశారు.