‘సప్త సాగరాలు దాటి – సైడ్ బి’ ట్రైలర్ రిలీజ్….

‘సప్త సాగరాలు దాటి – సైడ్ బి’ ట్రైలర్ రిలీజ్....
Cinema News

ఇటీవల కన్నడలో హేమంత్ ఎన్ రావు దర్శకత్వంలో తెరకెక్కి మంచి విజయం అందుకున్న సినిమా సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా సప్త సాగరాలు దాటి సైడ్ ఏ అనే టైటిల్ తో తెలుగులో డబ్ కాబడి ఇక్కడ కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఆ సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కిన సప్త సాగరాలు దాటి సైడ్ బి మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 17న రిలీజ్ కి రెడీ అయింది.

‘సప్త సాగరాలు దాటి – సైడ్ బి’ ట్రైలర్ రిలీజ్....
Saptha Sagaralu Dati

విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ మూవీ నుండి ఒక సాంగ్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకోగా ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ఈ ట్రైలర్ నేడు సాయంత్రం 6 గం. 6 ని. లకు రిలీజ్ కానుంది. కాగా తెలుగులో ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి ద్వారా విడుదలవుతోంది. మరి రిలీజ్ అనంతరం సప్త సాగరాలు దాటి సైడ్ బి ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.