సప్తగిరి సందడి కొనసాగుతుంది

Sapthagiri LLB movie Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కమెడియన్‌ సప్తగిరి హీరోగా మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సప్తగిరి మొదటి సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ సక్సెస్‌ గాలివాటు సక్సెస్‌ కాదని, కష్టపడి ఆ సినిమాను చేశాను అంటూ తాజా చిత్రంతో నిరూపించుకున్నాడు. సప్తగిరి హీరోగా రెండవ చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ తెరకెక్కి గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన జాలీ ఎల్‌ఎల్‌బీ చిత్రాన్ని ఇది రీమేక్‌. తెలుగులో ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ టైటిల్‌తో కాస్త కామెడీని జోడివ్వడంతో పాటు, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను మార్చి చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆధరిస్తున్నారు.

Sapthagiri-LLB-movie

‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రంతో పాటు పలు చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాని వాటన్నింటి కంటే కూడా ఈ చిత్రం మాస్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ దూసుకు పోతుంది. ప్రస్తుతం సినిమాకు మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయని, ఇప్పటికే పెట్టిన పెట్టుబడి రికవరీకి దగ్గరగా వచ్చినట్లుగా ట్రేడ్‌ టాక్‌ వినిపిస్తుంది. సప్తగిరి ఈ చిత్రంలో పూర్తి స్థాయి కమర్షియల్‌ హీరోగా కనిపించి మెప్పించాడు.

తెలుగులో సప్తగిరి ఒక పూర్తి స్థాయి హీరోగా మారినట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంతో సప్తగిరి హీరోగా రెండు మూడు మెట్లు ఎక్కినట్లే అని, తప్పకుండా భవిష్యత్తులో సప్తగిరికి హీరోగా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సప్తగిరి రెండు చిత్రాలను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. మొదటిది సప్తగిరి సన్నీలియోన్‌ భర్త రెండవది సప్తగిరికి దెయ్యం పట్టింది. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.