అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

17ఏళ్ల వయసులోనే 2006లో ఇంగ్లండ్‌ తరఫున అరంగేట్రం చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ క్రీడాకారిణి సారా టేలర్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. దశాబ్ద కాలానికి పైగా తన సత్తా చూపించిన ఈ ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ ‘మానసిక బెంగ’తో బడపడుతున్నది.

ఇంగ్లండ్‌ సాధించిన చాలా విజయాల్లో తన స్థానం ఎవరు భర్తీ చేయలేరు. ఇంగ్లాండ్ ఉమెన్ టీం వికెట్ కీపర్ గా  బ్యాట్స్ ఉమెన్ సారా టేలర్ గా సంచలనాలు ఎన్నో. అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సారాటేలర్‌ ఇక క్రికెట్ తన వల్ల కాదని తేల్చి చెప్పేసింది. 126 వన్డేలు, 90 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు, 10 టెస్టులు ఆడిన టేలర్‌ మొత్తం 6,533 పరుగులు తీసింది.