సరిలేరు నీకెవ్వరూ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్

సరిలేరు నీకెవ్వరూ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం సెన్సార్ పూర్తీ చేసుకుంది. సింగిల్ సీన్ కట్ లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చారని చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ చిత్రం దాదాపు 160 నిమిషాల నిడివి వుంది. మహేష్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సరిలేరు నీకెవ్వరూ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని చిత్ర యూనిట్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం సెన్సార్ సర్టిఫికెట్ ఫై ఎలాంటి విడుదల తేదీని ప్రకటించలేదు. ఈ విషయం ప్రస్తుతం చర్చంశనీయం అయింది. సరిలేరు నీకెవ్వరూ చిత్రం కి పోటీగా అల్లు అర్జున్ చిత్రం అలా వైకుంఠపురంలో చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం అనుసరించే కొన్ని స్ట్రాటెజీలే, మహేష్ చిత్ర బృందం కూడా అనుసరిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ చిత్రం ముందు తెలిపిన విడుదల తేదీల్లోనే విడుదల అవుతాయో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.