‘సవ్యసాచి’ ట్రైలర్ : అద్బుతం అంటారు…!

Savyasachi-Official-Trailer

‘ప్రేమమ్’ వంటి యావరేజ్ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్య – చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న ‘సవ్యసాచి’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్ని అద్బుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలును, వరసకు కనిపించని అన్నని, ఈ సవ్యసాచిలో సగాన్ని…’ అంటూ టీజర్‌తోటే అంచనాలు పెంచేసిన చైతూ.. తాజా ట్రైలర్‌తో ఈ అంచనాల్ని రెట్టింపు చేశారు. వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో చైతూకి జోడీగా నిధి అగర్వాల్ నటించింది.

Savyasachi

హీరో మాధవన్, భూమికలు కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు. రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. ‘బాహుబలి 2’ చిత్రం తరువాత ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్ ను మీరు కూడా చూసెయ్యండి మరి.