ప్రభాస్‌ అభిమానుల అతి వల్ల నలుగురికి గాయాలు…!

Celebrity Wishes For Bahubali Hero Prabhas

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అన్ని ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రభాస్‌ కూడా మీడియా ప్రతినిధులకు ఫిల్మ్‌నగర్‌లో పార్టీ ఏర్పాటు చేశాడు. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా కృష్ణా జిల్లాలో ప్లెక్సీలతో రోడ్డుపై ర్యాలీ చేశారు. బైక్‌ల మీద ర్యాలీ చేస్తూ ఉండగా ప్రభాస్‌ ప్లెక్సీ అదుపు తప్పి అటుగా వస్తున్న కారుపై పడిరది. ఒక్కసారిగా కారుపై ప్లెక్సీ పడడంతో కారు పాదాచారుల పైకి దూసుకెళ్లింది.

prabash

కారు అదుపు తప్పి పాదాచారుల మీదకి వెళ్లడంతో అక్కడ ఉన్న నలుగురు పాదాచారులకు గాయాలయ్యాయి. దాంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అత్యుత్సాహం వల్ల ఈ ఘటన జరిగిందని అంతేకాకుండా బైక్‌ హారన్‌లతో రోడ్డు అంతా అల్లకల్లోలం చేశారంటూ స్థానికులు అభిమనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల అతి పట్ల సోషల్‌ మీడియాలో కూడా భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలోని వీడియో తాజాగా ప్రభాస్‌ పుట్టిన రోజు కానుకగా విడుదలై మంచి స్పందనను దక్కించుకుంది.

prabash-birthday