రహస్య పెళ్లి వైరల్: ప్రియుడి ఫోటోల లీక్ తో అమ్మాయి సూసైడ్ … .

ప్రాణాలను బలి తీసిన ప్రేమ వ్యవహారం

తెలంగాణలో ఘోరం జరిగింది. అదేమంటే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యుతిని గతంలో ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని దాచిపెట్టి మళ్లీ పెద్దలు కుదర్చిన మరో యువకుడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రియుడు అంటే మొదటి రహస్యపు మొగుడు తామ పెళ్లి చేసుకున్న నాటి ఫోటోలను ఆమెకు.. కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపించాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన ఆ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికంగా కలకలం రేగింది.

అయితే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ మండలంలోని కుదురుమళ్ల గ్రామానికి చెందిన మొసట్ల శైలేందర్, సరోజిని దంపతుల పెద్ద కుమార్తె స్రవంతి మహబూబ్‌నగర్‌లో బీఈడీ ఫస్టియర్ చదువుతోంది. అదే ఊరుకు చెందిన తిరుపతయ్య, ఆమె మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం వారిద్దరు ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకొని ఫొటోలు కూడా దిగారు. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో కాలేజీకి సెలవుల రావడంతో స్రవంతి సొంతూరుకు వచ్చేసింది. కాగా తాజాగా కర్ణాటకకు చెందిన ఓ యువకుడితో స్రవంతికి ఇంట్లో పెద్దలు పెళ్లి సంబంధాన్ని కుదిర్చారు. కాగా ఈ నెల 30వ తేదీన వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి ఏర్పాట్ల ఘనంగా జరుగుతున్నాయి.

ఉన్నట్టుండి ఈ విషయం తెలుసుకున్న తిరుపతయ్య తమ పెళ్లి ఫోటోలను స్రవంతికి కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపించాడు. తమకు పెళ్లి జరిగిన విషయాన్ని చెప్పేశాడు. అంతటితో ఆగకుండా అనేక వాట్సాప్‌ గ్రూపుల్లో తమ పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై వరుడి తరుపు వారు శైలేందర్, సరోజిని దంపతులను నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన అమ్మాయికి మళ్లీ పెళ్లి చేస్తూ తమను మోసం చేస్తున్నారని పెళ్లి కొడుకు తరఫు వాళ్లు గొడవకు దిగారు. దీంతో తల్లిదండ్రులు స్రవంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పని చేసి గ్రామంలో.. బంధువుల్లో తమ పరువ తీశావంటూ ఆవేదనకు లోనయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన స్రవంతి గురువారం పురుగులమందు తాగి మృతి చెందింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను కొడంగల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మృతురాలి తండ్రి శైలేందర్ ఫిర్యాదుతో పోలీసులు ప్రియుడు తిరుపతయ్య.. అతడికి సహకరించిన కోసిగి వెంటకయ్యపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.