బాలీవుడ్‌లో మరో విషాదం

బాలీవుడ్‌లో మరో విషాదం

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సీనియర్‌ నటి కుంకుమ్ (86) కన్నుమూశారు. మదర్ ఇండియాతో గుర్తింపు తెచ్చుకున్న కుంకుమ్‌ అనారోగ్యంతో కారణంగా మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కుంకుమ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.మరొక ఆణిముత్యాన్ని కోల్పోయామంటూ నవేద్‌ జాఫ్రీ ట్వీట్‌ చేశారు.

1954 లో ఆర్ పార్ చిత్రం లోని’కబీ ఆర్ కబీ పార్ లాగా తీరే నాజర్’ పాటతో అడుగుపెట్టి నర్తకిగా తనదదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్‌లో దాదాపు 100 సినిమాలకు పైగానే నటించారు. కోహినూర్, ఉజాలా, ఏక్ సపేరా ఏక్ లూఠేరా, నయా దౌర్, రాజా ఔర్ రంక్, గీత్, ఆంఖేన్, లల్కర్ లాంటి ఎన్నో సినిమాల ద్వారా తన నటనా ప్రతిభను చాటుకున్నారు కుంకుమ్‌.