ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న షారుఖ్ ఖాన్ “చిత్రం ” …!

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న షారుఖ్ ఖాన్
Cinema News

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాదిలో రెండు చిత్రాలు లు రిలీజ్ చేయగా ఈ రెండు కూడా ఒకదాన్ని మించి మరొకటి భారీ బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. మరి వాటిలో రీసెంట్ గా విడుదల అయ్యిన సినిమా నే “జవాన్”. కోలీవుడ్ యంగ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార మరియు దీపికా పదుకోన్ లు హీరోయిన్స్ గా నటించగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు.

 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న  షారుఖ్ ఖాన్  "చిత్రం " ...!
Shah rukh Khan

ఇక షారుఖ్ సహా బాలీవుడ్ హిస్టరీ లోనే ఒక రికార్డ్ గ్రాసర్ గా ఈ సినిమా నిలవగా ఫైనల్ గా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి హిందీ తెలుగు తమిళ్ భాషల్లో ఎక్స్ టెండెడ్ వెర్షన్ లో అయితే ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి ఈ భారీ బ్లాక్ బస్టర్ ని ఆదనపు సీన్స్ తో చూడాలి అనుకునే వారు నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి .