షకీలా శీలవతా ? నోనో !

Shakeela Request To Censor Board

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

షకీలా సినిమా రిలీజ్ అవుతుంది అంటే కేరళలో పెద్ద హీరోలు కూడా తమ సినిమాలు రిలీజ్ ఆపేసుకుని వెనక్కి వెళతారు. ఆమె సినిమాలకు అంత డిమాండ్ ఉంది మరి కనీ గత పదేళ్లుగా ఆమె అస్సలు సినిమాలు చేయడం లేదు. అలాంటిది తను నటించిన 250వ సినిమాగా ‘శీలవతి’ఇటీవలే పూర్తయింది. ఇప్పుడు ఈ సినిమాకి శీలవతీ అనే పేరే అడ్డంకిగా మారింది అనే వార్తలు వినపడుతున్నాయి. సినిమా చూడకుండానే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందట. ఈ సినిమా టైటిల్‌ను సెన్సార్ బోర్డు ఆమోదించడం లేదని సమాచారం. టైటిల్ మార్చాలని బోర్డు షకీలాకు స్పష్టం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్‌కు తాము ఓకే చెప్పలేమని షకీలా సినిమాకు శీలవతి టైటిల్ యాప్ట్ కాదని, సినిమా టైటిల్ మారిస్తేనే సెన్సార్ కు అనుమతి ఇస్తామని కేంద్ర సెన్సార్ బోర్డు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే ముందు ఈ సినిమాను చూడాలని షకీలా సినిమాను చూసిన తర్వాత అభ్యంతరాలు చెప్పాలని, సినిమా చూడకుండానే అభ్యంతరాలు చెబితే ఎలా? అని ఆమె వాదిస్తోంది. తన సినిమాకు ‘శీలవతి’ అనే టైటిల్ మాత్రమె కరెక్టు అని షకీలా స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో సెన్సార్ బోర్డుతో పోరాడతాను అని ఆమె ప్రకటించింది. ఈ పోరాటంలో తనకు చిత్రసీమ మద్దతు అవసరమని షకీలా కోరింది. శీలవతి టైటిల్ ను మార్చేది లేదని అంటోంది. ఈ సినిమా ప్రారంభం నుంచి షకీలా గట్టిగానే ప్రచారం చేసుకుంది. ఇది తన 250వ సినిమాగా ఆమె ప్రచారం చేసింది. అయితే ఆమె ప్రతిష్టాత్మక సినిమాగా భావిస్తున్న ఈ సినిమాని సెన్సార్ బోర్డు హోల్డ్ లో పెట్టడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.