భాగమతి గురించి షాకింగ్‌ పుకారు

Shocking News about Anushka's Bhaagamathie Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనుష్క హీరోయిన్‌గా అశోక్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ‘భాగమతి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్‌ డే సందర్బంగా ఈనెల 26న విడుదల చేయబోతున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ట్రైలర్‌ మరియు పోస్టర్‌లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అనుష్కను అందంగా చూడాలని కోరుకుంటున్న ప్రేక్షకులకు ఈ చిత్రం నిరాశను మిగుల్చుతుందని, అనుష్క ఎక్కువ శాతం డీ గ్లామర్‌గానే ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

‘అరుంధతి’ చిత్రంలో చాలా తక్కువ భాగంలో అనుష్క డీ గ్లామర్‌గా కనిపిస్తుంది. సినిమా ఆరంభం నుండి చివరి వరకు రెండు పాత్రల్లో కూడా గ్లామర్‌గా కనిపించింది. కాని ‘భాగమతి’లో మాత్రం అనుష్క పూర్తిగా డీ గ్లామర్‌ పాత్రలోనే కనిపించబోతుంది. సినిమా ఎక్కువ శాతం ఆ పాడుబడిన బంగ్లాలో తెరకెక్కించడం జరిగింది. ఇక సినిమాలో ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండదని, ఎక్కువగా హర్రర్‌ సీన్స్‌ ఉంటాయని సమాచారం అందుతుంది. హర్రర్‌ సీన్స్‌ ఆకట్టుకుంటే పర్వాలేదు. అలా కాకుండా ఆసక్తికరంగా సాగకుంటే అప్పుడు ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ లేని లోటును ఫీల్‌ అవుతారు. అందుకే ‘భాగమతి’ చిత్రం గురించి కొందరు అప్పుడే నెగటివ్‌గా మాట్లాడుతున్నారు. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.