అయ్యో… జనవరి మొత్తం వృదా అయ్యిందే

negative-response-on-bhaagamathie-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2018 సంవత్సరం ప్రారంభం అయ్యి నెల పూర్తి కావస్తుంది. అయినా ఇప్పటి వరకు టాలీవుడ్‌లో సాలిడ్‌ సక్సెస్‌ పడలేదు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి, జైసింహా, రంగుల రాట్నం చిత్రాలు బొక్క బోర్లా పడ్డాయి. ముఖ్యంగా అజ్ఞాతవాసి చిత్రం 150 కోట్లు వసూళ్లు చేస్తుందని భావించిన ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చి కేవలం 60 కోట్ల వద్ద ఆగిపోయింది. ఇక బాలయ్య నటించిన జైసింహా చిత్రం కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. బాలయ్య కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా జైసింహా నిలిచింది. రాజ్‌ తరుణ్‌ హీరోగా నాగార్జున నిర్మించిన రంగుల రాట్నం చిత్రం తప్పకుండా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తుందనుకున్నారు. కాని ఆ సినిమా అసలు విడుదలైందా లేదా అన్నట్లుగా పరిస్థితి ఉంది. వచ్చింది, పోయింది.

సంక్రాంతి సీజన్‌ తర్వాత రిపబ్లిక్‌ డేకు మూడు నాలుగు పెద్ద సినిమాలు విడుదల చేయాలని భావించారు. కారణం ఏదో కాని తప్పకుండా వస్తాడని భావించిన రవితేజ తన టచ్‌ చేసి చూడు చిత్రాన్ని వాయిదా వేశాడు. మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం కూడా రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల కాలేదు. అనుష్క నటించిన ‘భాగమతి’ మాత్రమే రిపబ్లిక్‌ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2018లో మొదటి బ్లాక్‌ బస్టర్‌గా భాగమతి నిలువబోతుంది అంటూ అంతా భావించారు. కాని సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.

భారీ అంచనాల నడుమ తెరకెక్కిన భాగమతి చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది, ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యింది. భాగమతి ఫ్లాప్‌తో 2018 జనవరి మొత్తం వృదా అయ్యిందని ట్రేడ్‌ విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు. అయితే 2018లో ఇంకా 11 నెలలు బ్యాలన్స్‌ ఉన్నాయని, ఆ 11 నెలల్లో ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయని, అందులో ఎక్కువ శాతం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికి అయితే మొదటి నెల మొత్తం బాక్సాఫీస్‌ ఖాళీగానే సాగింది. గత కొన్ని సంవత్సరాలుగా జనవరిలో ఇలాంటి పరిస్థితి తారసపడినది లేదు.