మాటల మాంత్రికుడు ఏంటి ఈ పుకార్లు…!

Shocking Rumours About Bunny Trivikram Project

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్నో కష్టాలు పడుతూ తెలుగు పరిశ్రమకు వచ్చాడు. మొదట కొన్ని సినిమాలకు రచయతగా పనిచేసాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించాడు. ఆ తరువాత మెట్టు మెట్టుగా ఒక్కొక్కటి ఎక్కుతూ దర్శకత్వం వైపు అడుగులు వేస్తూ వచ్చాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసి అంతో మందిని స్టార్ హీరోలుగా మలిచాడు. త్రివిక్రమ్ సినిమాలు మనం భాగా గమనించినట్లైతే అందులో అయన మార్క్ కనపడే విధంగా పంచ్ డైలాగ్ లు ఉంటాయి అది అతని స్టైల్. అంతటి పేరును సంపాదించుకున్న త్రివిక్రమ్ పైన కూడా కొన్ని సినిమా రూపంలో రూమర్స్ ఉన్నాయి. ఉదాహరణకు అయన దర్శకత్వంలో వచ్చిన అతడు, జులాయి మూవీ లను తీసుకున్నట్లయితే అవి హాలీవుడ్ సినిమా నుండి స్ఫూర్తి పొంది కాఫీ కొట్టాడని స్పష్టంగా తెలిసిపోతుంది.

అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత సినిమాలు ఎక్కడెక్కడ నుండి స్ఫూర్తి పొందాడో అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. తాజాగా అల్లు ఆర్జున్ తో త్రివిక్రమ్ శ్రీను ఓ సినిమాను రుపొందిన్చనున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పుర్హి చేసుకుని సిద్దంగా త్రివిక్రమ్ పై అల్లు ఆర్జున్ సినిమా గురుంచి ఆ మద్య కొన్ని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు తియ్యబోయే చిత్రం బాలీవుడ్ సినిమా ‘సోనూ కీ టీటూ కే స్వీటీ’రీమేక్ అంటూ సోషల్ మీడియాలో ఉదరగోట్టారు. కానీ అది నిజం కాదని తెలవడంతో మరల కొత్త పుకార్లకు తావిస్తుంది. పదేళ్ళ కిందట వచ్చిన ఇన్వెన్షన్ అఫ్ లయింగ్ అనే సినిమానుండి స్ఫూర్తి పొందాడు అంటున్నారు. త్రివిక్రమ్ సినిమాలు ఇప్పటివరకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలోను, స్క్రిప్ట్ వర్క్ పూర్తయినా తరువాత ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. ఇలా స్టార్టింగ్ దశలోనే ఇలాంటి పుకార్లు రావడం అనేది త్రివిక్రమ్ ను అయోమయంలో పడేస్తుంది. అల్లు ఆర్జున్ విషయంలో ఆ రూమర్స్ లో ఎంత వరకు నిజం ఉన్నదో తెలియాలంటే మరి కొద్ది రోజులు అగాలిసిందే.