నాగ్ వద్ద భర్త కోసం రమ్యకృష్ణ పైరవీ…!

Ramya Krishna Referred Krishna Vamsi To Nagarjuna

సినియర్ డైరక్టర్ కృష్ణవంశీ ఒక్కపుడు మంచి మంచి సినిమాలు తీసి ఎందరో స్టార్ హీరోస్ కి హిట్ట్స్ ను అందించాడు. ఈ మద్య అయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు వరసగా ప్లాప్స్ కావడంతో కృష్ణ వంశీ పేరునే తెలుగు సినిమా ప్రేమికులు మరిచిపోయే స్తాయికి వచ్చారు. కృష్ణవంశీ మాత్రం ఎలాగైనా బౌన్సు బ్యాక్ కావాలని గట్టి ప్రయత్నంలో ఉన్నాడు అందుకోసం ఓ మరాటి సినిమాను రీమేక్ చెయ్యాలని ఆలోచనలో ఉన్నాడు. అక్కడ ఘన విజయం సాదించిన నటసామ్రాట్ అనే చిత్రంను రీమేక్ చేసేపనిలో ఉన్నట్లు ఈ మద్య భాగా వార్తలు వచ్చయి. అందుకోసం రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ కి సపోర్ట్ గా రంగంలోకి దిగింది. అక్కినేని నాగార్జున తో రమ్యకృష్ణ అప్పట్లో సూపర్ హిట్ట్స్ చిత్రలో నటించింది. అంతెందుకు ఈ మద్య వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో బంగారాజు పెళ్ళాం గా నటించి మంచి మార్క్స్ కొట్టేసింది.

ఆ చనువుతోనే నాగార్జున ను కృష్ణవంశీ కి మరో అవకాశంగా డైరక్షన్ ఛాన్స్ ఇవ్వాలని నాగ్ ను ఈ మద్య రమ్య కృష్ణ సంప్రదించినట్లు సమాచారం. నాగార్జున కృష్ణవంశీ కాంబినేషన్ లో నిన్నే పెళ్ళాడతా అనే సూపర్ హిట్ట్ చిత్రం వచ్చింది ఆ తరువాత ఆ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా చంద్రలేఖ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే, ఆ టైం లో నాగ్ కు కృష్ణవంశీ కి మద్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి అప్పటి నుండి వారి మద్య మాటలు లేవని ఇండస్ట్రి టాక్. ఇప్పుడు రమ్యకృష్ణ నటసామ్రాట్ సినిమా రీమేక్ కోసం నాగ్ తో ప్రయత్నాలు చేస్తుంది. అసలకే వర్మ ఇచ్చిన ఆఫీసర్ సినిమా ప్లాప్ తో ఉన్నాడు ఈ టైములో వర్మ స్కూల్ నుండి వచ్చిన కృష్ణవంశీ కి ఛాన్స్ ఇస్తాడనుకోవడంలేదు.