కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్‌-2022 సీజన్‌ మెగా వేలం ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయస్ అయ్యర్‌ను రీటైన్‌ చేసుకోలేదు. ఈ క్రమంలో రానున్న మెగా వేలంలో శ్రేయస్ దక్కించుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు పోటీ పడడం ఖాయం. ఇప్పటికే ఐపీఎల్‌లోకి కొత్తగా రాబోతున్న అహ్మదాబాద్ జట్టు కెప్టెన్‌గా అయ్యర్‌ ఎంపిక దాదాపు ఖరారైననట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యర్‌కి సంబంధించిన మరో వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ ఏడాది సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ ఎంపిక కానున్నడన్నది ఆ వార్త సారాంశం. కాగా గత సీజన్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌గా వ‍్యవహరించిన ఇయాన్‌ మోర్గాన్‌ని ఫ్రాంచైజీ రీటైన్‌ చేసుకోలేదు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కెకెఆర్ కెప్టెన్సీ బాధ్యతలు శ్రేయస్‌ అయ్యర్‌కి అప్పజెప్పాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయ్యర్‌తో కెకెఆర్ ప్రతినిధులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా ఐపీఎల్‌-2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అయ్యర్ అద్భుతంగా రాణించాడు. జట్టు ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాల్గువ ఆటగాడిగా అయ్యర్‌ నిలిచాడు. అయితే గాయం కారణంగా ఐపీఎల్‌-2021 మొదట దశకు దూరమయ్యాడు. దీంతో కెప్టెన్‌గా పంత్‌ ఎంపికయ్యాడు. కాగా అయ్యర్‌ జట్టులోకి వచ్చినప్పటికీ కెప్టెన్‌గా పంత్‌వైపే యాజమాన్యం మొగ్గు చూపింది.