హీరోయిన్ కార్ ని గుద్దిన ఆటోడ్రైవర్

Singer Sophie Choudry Car Hit By Auto Rickshaw Driver Held

బాలీవుడ్ నటి సోఫీ చౌదరి ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కార్ ని వేగంగా వస్తున్న ఒక ఆటోరిక్షా ఢీ కొట్టడంతో ఖార్(వెస్ట్) కి చెందిన ఖార్ జింఖానా వద్దగల 16 వ రోడ్ దగ్గర యాక్సిడెంట్ కి గురయ్యింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ సంజయ్ మోరే అందించిన సమాచారం ప్రకారం, ఈ యాక్సిడెంట్ నిన్న రాత్రి 9.15 సమయంలో జరగగా, పోలీసులు వెంటనే 10.30 సమయానికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సోఫీ చౌదరి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, ఆమె తన కార్ ని తానే డ్రైవ్ చేస్తూ, ఇంటికి వెళ్తుండగా అదే సమయంలో వేగంగా దూసుకొస్తున్న ఒక ఆటోరిక్షా సోఫీ చౌదరి కార్ ని క్రాస్ చేయాలనుకున్నాడు. కానీ, ఈ రెండు వాహనాల మధ్య ఉన్న దూరాన్ని సరిగ్గా అంచనావేయలేక ఆ ఆటోడ్రైవర్ తన ఆటోరిక్షాని కార్ పైకి దూసుకొచ్చి యాక్సిడెంట్ చేసాడు.

Singer-Sophie-Choudry

ఈ ఘటనలో సోఫీ చౌదరి ప్రయాణిస్తున్న కార్ ముందుభాగం డామేజ్ కి గురవ్వడంతో, కార్ దిగి ఆ ఆటోడ్రైవర్ ని ఆపి ప్రశ్నించగా, ఆ ఆటోడ్రైవర్ కి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని, అతను ఆటో తోలడం మొదలెట్టి ఒకవారమే అయ్యిందని, ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించిన ఈ వ్యక్తి వలన ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందందున వెంటనే పోలీసులకు సమాచారం అందించామని తెలిపింది. అంతేకాకుండా, తన కార్ కి ఇన్సూరెన్సు ఉందని, కార్ కి జరిగిన డామేజ్ కి తానేమి చింతించడం లేదని, కానీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా అతివేగంతో ఆటో నడుపుతున్న ఆ డ్రైవర్ వల్ల ఇతరులకు ప్రమాదం జరగవచ్చనే ఆలోచన తనని బయపెట్టిందని చెప్పింది. పోలీసులు సేకరించిన సమాచారం మేరకు, ఈ ఘటనలో నిందితుడు అనీష్ ఆహ్మద్ (21) గా గుర్తించి, ఐపీసీ సెక్షన్ క్రింద కేసు బుక్ చేసి, లోకల్ కోర్ట్ లో ప్రవేశపెట్టనున్నారు.