మైండ్ గేమ్…నీవు నేర్పిన విద్యయే కేసీఆర్

Two More TRS MPs Likely To Join Congress Party

రేవంత్ రెడ్డి తన చిరకాల ప్రత్యర్ధి అయిన టీఆర్ఎస్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల వేళ కేసీఆర్ ముందుగా మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. అయితే కేసీఆర్ ఎత్తుగడలు ముందే కనిపెట్టే పనిలో ఉన్న కాంగ్రెస్ కూడా రివర్స్ గేమ్ కు తెరలేపింది. ఎప్పుడూ మైండ్ గేమ్ లో ముందుండే కేసీఆర్ ఈ సారి కాంగ్రెస్ కంటే వెనకపడ్డాడు. ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుందోగానీ, మైండ్ గేమ్‌లో మాత్రం మహాకూటమిదే విజయం అని చెప్పాలి. ఇటీవల మహాకూటమిలోని పార్టీలకు సంబంధించిన ఇద్దరు నాయకులు టీఆర్ఎస్‌లోని బాడా నేతను టార్గెట్ చేశారు. ఆ నేతపై సంచలన వ్యాఖ్యలు చేసి వాటికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కొద్దిరోజుల మంత్రి హరీశ్ రావు ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్‌కు చెందిన వంటేరు ప్రతాపరెడ్డి.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి.. హరీశ్ గురించి మాట్లాడారు గజ్వేల్‌లో పోటీ చేయనున్న కేసీఆర్‌ను ఓడించేందుకు హరీశ్ ప్రయత్నాలు చేశారని, తనకే ఆర్థిక సహాయం కూడా చేస్తానన్నారని వంటేరు బాంబు పేల్చారు.

Revanth Urges EC To Book Case Against KCR For Offering Rs 10 Crore

దీనికి తోడు రేవూరి కూడా కేసీఆర్ హరీశ్‌ను చిన్న చూపు చూస్తున్నారని దమ్ముంటే ఆయనను వారసుడిగా ప్రకటించాలని గులాబీ బాస్‌కు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ కు కూటమికి సమానంగా సీట్లు వస్తే తన వర్గం నేతలతో హరీష్ కూటమి నుండి సీఎం అయ్యే అవకాశం వుంది అని చెప్పి షాక్ ఇచ్చారు. వీళ్ల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. అంతేకాదు, టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపాయి. దీంతో హరీశ్, కేటీఆర్ సహా పలువురు మీడియా ముందుకొచ్చి మరీ ఇది అసత్యం అని ఖండించారు. ఇక హరీశ్ అయితే ఈ ఆరోపణలను తిప్పి కొడుతూనే, గజ్వేల్‌లో కేసీఆర్‌ను గెలిపిస్తానని చెప్పారు. అన్నదే పనిగా గజ్వేల్ ను అంటిపెట్టుకుని రాజకీయం చెయ్యటం లో బిజీగా వున్నారు హరీష్ రావు. దీంతో ఒకరకంగా ఆయనను గజ్వేల్ కు పరిమితం చేయడంలో కాంగ్రెస్ విజయం సాదించింది. ఆ తర్వాత కొద్ది రోజులకి తెరాస ఎంపీలు ఇద్దరు తమ పార్టీలో చేరుతున్నారని ప్రకటించి రేవంత్ మరో సంచలనానికి తెర లేపాడు. ఆయన ప్రకటించిన వెంటనే ఆ ఇద్దరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీతారం నాయాక్ అనే పేర్లు బయటకు వచ్చాయి. వెంటనే వారు అదేమీ లేదని ప్రకటించినా రోజులు గడవక ముందే విశ్వేశ్వర్ రెడ్డి కారు దిగి హస్తం అందుకున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేసం అయిన వెంటనే.. తెలంగాణలో ఇక నెక్ట్స్ ఎవరు అన్న చర్చ ఓ రేంజ్‌లో సాగడం ప్రారంభమయింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం కాంగ్రెస్ లో కన్నా టీఆర్ఎస్ లోనే ఎక్కువ కలకలం రేపింది. తమ రాజకీయ భవిష్యత్ పై ఆలోచన చేస్తున్న పలువురు ఎంపీలు దీనిపై లోతుగా పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా ప్రచారం జరుగుతోందన్న అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి.

harishrao-and-kcr
చేవేళ్లను ఆనుకుని ఉండే నియోజకవర్గానికి చెందిన ఓ ఎంపీ చాలా రోజులుగా టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఆయన అవడానికి తెలంగాణ వ్యక్తే కానీ తెలుగు కూడా సరిగ్గా రాదు. ఆయన గతంలోనే పార్టీ మారుతారని ప్రచారం జరగింది. తర్వాత సైలెంటయిపోయారు. అలాగే ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థ వలలో పడిన.. మరో ఎంపీ కూడా రెడీ అవుతున్నారని చెబుతున్నారు. అసలు ఆ ఎంపీ ఓ మంత్రిపై అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. చివరి క్షణంలో దర్యాప్తు సంస్థ సోదాలతో వెనక్కి తగ్గారు. ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం ఉన్న జిల్లాకు చెందిన ఎంపీ కూడా అదే బాటలో ఉన్నారని తన పాత పరిచయాలతో రంగంలోకి దిగారంటున్నారు. ఆయన జీవితాశయం మంత్రి కావడం, ఇప్పుడు పోటీ కి చాన్స్ రాకపోవడంతో తన కలలు కల్లలయినట్లే. అందుకే వచ్చిన చోటకే పోదామనుకుంటున్నారట. ఇప్పటికే సీతారామ్ నాయక్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయనకు బదులుగా లక్ష్మణ్ నాయక్ అనే కేరళ క్యాడర్ ఐపీఎస్‌కు ఎంపీ టిక్కెట్ ఇస్తున్నారని కూడా చెబుతున్నారు. కానీ పార్టీ మార్పు విషయం ఆయన మొదటి నుండి ఖండిస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఐదారుగురు ఎంపీలు రెడీగా ఉన్నారని.. అందర్నీ డిసెంబర్ ఏడు లోపు కాంగ్రెస్ పార్టీలో చేర్చేస్తామని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. ఒకరకంగా టీఆర్ఎస్‌లో ఎంపీలకు అసలు కనీస గౌరవం దక్కడం లేదు దీంతో దాదాపుగా వారు అసంతృప్తిలో ఉన్నారు. వారందర్నీ పార్టీలో చేర్చుకోవడం వల్ల ఆయా ఎంపీలు ఉన్న నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభావం పడుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా.ఎంపీల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్ మైండ్ గేంకి ఎంతమంది పడిపోతారు అనేది తేలాల్సి ఉంది.

Revanth Reddy And KCR