‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మల్టీస్టారర్‌లో విలన్‌ ఆ స్టార్‌ హీరో…!

Yash Acting On Vilan Role In RRR Movie

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన నేపథ్యంలో సినిమా గురించి రోజుకో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్స్‌ ఎవరు విలన్‌ ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వని జక్కన్న ప్రస్తుతం కన్నడ హీరో యష్‌ను విన్‌ పాత్రకు అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. యష్‌ విలన్‌ పాత్రలో నటిస్తే అక్కడ కూడా సినిమాకు మంచి బిజినెస్‌ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

RRR-Launch-Event

స్టార్‌ హీరోను తన సినిమాలో విలన్‌గా చూపించే జక్కన్న ఈసారి కూడా అదే పని చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.యష్‌ హీరోగా కన్నడంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ చిత్రం మంచి భారీ అంచనాల నడుమ తెలుగు మరియు కన్నడంలో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ట్రైలర్‌తో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, హీరో పాత్ర చాలా భయంకరంగా ఉందనే టాక్‌ వస్తుంది. దాంతో యష్‌ను తన సినిమాలో విలన్‌గా నటింపజేస్తే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకోసం ఆయనతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో జరుగబోతున్న కేజీఎఫ్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో రాజమౌళి ప్రత్యేక అతిథిగా పాల్గొనబోతున్నాడు. ఆ కారణంగా కూడా ఈ చిత్రంలో యష్‌ విలన్‌గా నటించబోతున్నాడు అనే చర్చ జరుగుతోంది. గతంలో కన్నడ హీరో సుదీప్‌ను ‘ఈగ’ చిత్రం కోసం విలన్‌గా మార్చిన జక్కన్న తాజాగా యష్‌ను విలన్‌గా మార్చబోతున్నాడు.

Yash