ఆరేళ్ళ ప్రేమ పెళ్లి…మతం మార్చుకున్నా తప్పని తిప్పలు 

ఆరేళ్ళ ప్రేమ పెళ్లి...మతం మార్చుకున్నా తప్పని తిప్పలు 
వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్లు కాపురం చేశారు. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎక్కువవడంతో తన భర్త వేధిస్తున్నాడని. పోలీసులను ఆశ్రయించింది భార్య షబానా. అయితే తానేమీ భార్యను వేధించడంలేదంటున్నాడు భర్త.
హైదరాబాద్‌కు చెందిన కృష్ణవేణి… వరంగల్‌ వాసి రఫిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఇందుకోసం మతం కూడా మార్చుకుంది. షబానాగా మారింది. కొన్నాళ్లు వీరిద్దరూ బాగానే ఉన్నా… ఆ తర్వాత కుటుంబ కలహాలు మొదలయ్యాయి. షబానాకు పలు మార్లు గర్భస్రావం అవడంతో.. గొడవలు జరిగాయి. దీంతో … పోలీసులు కౌన్సెలింగ్ జరిపినప్పటికీ అవి తగ్గలేదు.
తాజాగా మరోసారి పోలీసులను ఆశ్రయించింది షబానా. తనను వదిలించుకొని వేరే పెళ్లిచేసుకునేందుకు భర్త ప్రయత్నిస్తున్నాడని షబానా ఆరోపిస్తుంది. షబానా చెబుతున్నదానిలో ఏమాత్రం నిజం లేదంటున్నాడు రఫీ. తానెప్పుడూ ఆమెను ప్రేమించి పెళ్లిచేసుకోలేదని చెబుతున్నాడు. షబానానే తన వెంట పడిందని అంటున్నాడు.
ఆరేళ్లు కలిసి జీవించిన తర్వాత ఇప్పుడు కేసులు పెట్టడాన్ని తప్పుబడుతున్నాడు. తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని వాపోతున్నాడు. మరోపక్క రఫీ తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఉన్నారని షబానా ఆరోపిస్తోంది. అయితే ఇప్పటికే పలుమార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ తన భార్యను తాను బాగానే చూసుకుంటున్నానని అంటున్నాడు రఫీ.