దారుణం…లైవ్ సంగీత కచేరీలో సింగర్ సజీవదహనం

దారుణం...లైవ్ సంగీత కచేరీలో సింగర్ సజీవదహనం

స్పెయిన్లో ఊహించని దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ స్పానిష్ గాయని జోయానా గార్సియా సంగీత కచేరి చేస్తూ వేలాది మంది అభిమానుల ముందే సజీవ దహనం అయింది. వేడుకలో భాగంగా అక్కడ పైరో టెక్నిక్ స్టంట్ నిర్వహించగా ప్రమాదవశాత్తు బాణాసంచా ఆమె మీదకి వచ్చి పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. జోయానా ప్రదర్శన పూర్తి కావొస్తుండగా పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సమీపంలోని ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్ళినా అయితే ఆ సింగర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మాడ్రిడ్ కు 130 కిలోమీటర్ల దూరంలో ఉండే లాస్ బెర్లనాస్ అనే పట్టణంలో ఒక మ్యూజిక్ షోను ఏర్పాటు చేశారు.

15 మంది మ్యుజీషియన్స్ ఉన్న హాలీవుడ్ ఆర్కెస్ట్రా ఈ కచేరీ చేపట్టింది. ఉత్సాహాంగా సాగిన ఈ షోను ముగించే ముందు వేదిక మీద భారీగా క్రాకర్స్ ను కాల్చారు. రెండు రాకెట్లు దూసుకొచ్చి జోయానా సెయిన్స్ కడుపులోకి వెళ్లాయి. దీంతో ఆమె మంటల్లో చిక్కుకున్నారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామానికి షాక్ చెందిన సహచరులు.. కార్యక్రమ నిర్వాహకులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. బాణసంచాలో పేలుడు పదార్థాన్ని మోతాదుకు మించి కూర్చటం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.