ఎందుకు కిడ్నాప్ చేశారు… 3రోజులు ఎక్కడుంచారు ?

వరంగల్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఎంజీఎం ఆస్పత్రిలో కిడ్నాపైన బాలుడు యశ్వంత్‌ని క్షేమంగా తల్లి ఒడికి చేరుకున్నాడు. ఆగష్టు 30 తేది మధ్యాహ్నం ఖిలావరంగల్‌ తూర్పు కోటకు చెందిన 7 సంవత్సరాల పెద్దోజు యశ్వంత్‌ని  దుండగులు కిడ్నాప్ చేశారు. వైద్య పరీక్షలకోసం ఇద్దరు కుమారులతో ఆసుపత్రికి వెళ్లాడు నర్సింహాచారి.
ఇంతలోనే చిన్న కుమారుడు యశ్వంత్ తప్పిపోయినట్లు గుర్తించాడు. వెంటనే మట్వాడ పోలీస్ స్టేషన్ లో బాలుడి ఆచూకి  కోసం ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిన బాలుడు చిన్నక్రాఫ్‌తో మెరూన్‌ కలర్‌ నెక్కర్, బ్లూ కలర్‌ షర్ట్‌ స్కూల్‌ డ్రెస్‌ వేసుకున్నాడని తెలిపారు.
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎంజీఎం  అస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి యశ్వంత్ ఆచూకీ కోసం గాలించారు. నగరంలోని ప్రతి వాహనాన్ని తనిఖీలు చేశారు. దీంతో యశ్వంత్‌ ను పట్టణం దాటించలేకపోయారు దుండగులు. అయితే మరోపక్క యశ్వంత్ కిడ్నాప్‌పై మీడియలో హడావుడి జరగడంతో దొరికి పోతామనే భావించిన దుండగులు వరంగల్ బస్టాండ్‌లో యశ్వంత్‌ను వదిలి వెళ్లారు. యశ్వంత్  ఆచూకి తెలియగానే తల్లిదండ్రులకు అప్పగించారు మట్వాడ పోలీసులు.
యశ్వంత్ సేఫ్‌గా ఇంటికి వచ్చినప్పటికి దుండగులు యశ్వంత్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారు… 3 రోజులు యశ్వంత్ కి ఎక్కడుంచారు అనే ప్రశ్నలు అందరి మదిని తొలచివేస్తున్నాయి.  యశ్వంత్  ఒంటిపై ఉన్న బట్టలు మారడంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అసలు బాబుని కిడ్నాప్ చేయటానికి అసలు కారణమేంటి.
దుండగులు యశ్వంత్ కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తులే అయి ఉండే అవకాశం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎండ్ వాయిస్‌: ఏదీ ఏమైనా తమ కుమారుడు సేఫ్‌గా తమ చెంతకు చేరాడని యశ్వంత్ తల్లి దండ్రులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. దీంతో యశ్వంత్ తల్లిదండ్రుల ఆనందానికి హద్దుల్లు లేకుండా పోయింది.