కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం…కొబ్బరి బొండాలకత్తితో

కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం...కొబ్బరి బొండాలకత్తితో

గుంటూరులో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పై అనుమానంతో దారుణంగా నరికి చంపాడు భర్త. ఈ ఘటన ఆదివారం రాత్రి గుంటూరు నగరంపాలెం పరిధిలో శివరామ నగర్ 15వ‌ లైన్ (చుట్టుకుంట)లో జరిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. దాసరి యేసు బాబు శివరామ నగర్ 15వ లైన్ లో ఉంటాడు. ఇతను కొబ్బరి బొండాలు వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇత‌ని భార్య దాసరి జ్యోతి, ఇళ్ళల్లో పని చేస్తూ ఉంటుంది.

ఈమె కానిస్టేబుల్ గా పనిచేసే కార్తీక్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని గతంలో చెప్పినా కూడా వినలేదన్న కోపముతో మనస్తాపం చెంది రాత్రీ సుమారు ఒంటి గంట సమయంలో కొబ్బరి బొండాల కత్తితో భార్య జ్యోతిని మెడ‌పై న‌ర‌క‌గా అక్కడికక్కడే చనిపోయింది. అనంత‌రం ముద్దాయి దాసరి ఏసుబాబు కత్తితో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రాత్రి నిద్రపోతుండగా ఈ దురాగతానికి పాల్పడ్డాడు.