స్కంద మూవీ ఓటీటీ రిలీజ్ కొత్త డేట్ ఫిక్స్……

స్కంద మూవీ ఓటీటీ రిలీజ్ కొత్త డేట్ ఫిక్స్......
Cinema News

ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా స్కంద. టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్​డ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. అయితే ఈ సినిమా అక్టోబరు 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుందని సదరు సంస్థ ప్రకటించింది. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందని రామ్ ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా అందరూ ఎదురుచూశారు. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఆ రిలీజ్​ను వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ కొత్త డేట్​ను ప్రకటించారు. ఇంతకీ ఎప్పుడు స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్కంద మూవీ ఓటీటీ రిలీజ్ కొత్త డేట్ ఫిక్స్......
Skandha

నవంబరు 2వ తేదీ నుంచి స్కంద చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. డిస్నీ+హాట్‌స్టార్‌ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయం షేర్ చేసింది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం ఇలా ఓటీటీలోకి రాగానే అలా ఈ మూవీ ను చూసేయండి మరి.