స్కూటీలో దూరి కాటేసిన పాము 

స్కూటీలో దూరి కాటేసిన పాము 
కీసర పీఎస్ పరిధిలోని రాంపల్లిలో ఓ నాగుపాము స్కూటీలోకి దూరిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. యాదాద్రి జిల్లా చీకటిమామిడికి చెందిన రాములు ఎఫ్‌సిఐలో పనిచేస్తున్నారు.  డ్యూటీకి వెళ్తున్న సమయంలో,  ఒక్కసారిగా స్కూటీలోంచి బయటకు వచ్చిన పాము రాములు చేతిని తాకింది. దీంతో, భయపడిన ఆయన స్కూటీని వదిలేసి పరుగు పెట్టారు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి సహాయంతో నాగుపామును బయటకు తీయించి, రాములుకు ప్రథమ చికిత్స చేయించారు.