కూకట్‌పల్లి హత్యకేసులో మరో ట్విస్ట్  

పబ్‌జీ ఆడొద్దన్నాడని నాన్నని అతి క్రూరంగా చంపిన కొడుకు !
సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆఫీసులో ఓ అమ్మాయితో తనకున్న వివాహేతర సంబంధం విషయాన్ని బయటపెడతాడన్న భయంతోనే  సతీశ్ ను హత్యచేసినట్టు హేమంత్ పోలీసులకు చెప్పాడు. గత నెల 27న  ఇద్దరూ మద్యం తాగుతున్న సమయంలో వివాహేతర సంబంధం గురించి సతీశ్ హేమంత్ ను హెచ్చరించాడు. కంపెనీకి చెడ్డపేరు వస్తుందని, ఆ యువతిని ఉద్యోగం నుంచి తీసేద్దామని సతీశ్ అన్నాడు. ఈ విషయం అందరికీ చెబుతాడన్న భయంతో హేమంత్ సతీష్ గొంతుకోసి హత్యచేశాడు. సతీష్ ను తాను ఒక్కడే హత్య చేశానని, తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని హేమంత్ పోలీసులకు చెప్పాడు.