మీదాకా వ‌స్తే కానీ స్పందించ‌రా..?

Social Activist Sandhya comments on Allu Aravind over RGV Comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను తిట్టాల్సిందిగా శ్రీరెడ్డిని ప్రోత్స‌హించాన‌ని చెప్పిన రామ్ గోపాల్ వ‌ర్మ‌పై మెగా నిర్మాత అల్లుఅర‌వింద్ విరుచుకుప‌డ‌డాన్ని సామాజిక కార్య‌క‌ర్త సంధ్య త‌ప్పుబ‌ట్టారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని వారిని అన‌డంతో అల్లు అర‌వింద్ వెంట‌నే వచ్చేశార‌ని, ఇదే వ‌ర్మ గ‌తంలో మ‌హిళాసంఘాల వారిని ఎన్నో మాట‌ల‌న్నా ఎవ‌రూ స్పందించ‌లేద‌ని సంధ్య మండిప‌డ్డారు. వ‌ర్మ మ‌హిళ‌ల‌పై వెట‌కారంగా మాట్లాడితే… దానిపై ఇండ‌స్ట్రీ నుంచి ఎవ్వ‌రూ మాట్లాడ‌లేద‌ని, ఇప్పుడు మాత్రం సినీ ప‌రిశ్ర‌మ‌లోని వారిని అన‌డంతో అంద‌రూ స్పందిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

వ‌ర్మ విష‌యంలో గ‌తంలో సినిమారంగంలోని వారు ఎందుకు స్పందించ‌లేద‌న్న ప్ర‌శ్న తాము వేస్తూనే ఉంటామ‌ని సంధ్య చెప్పారు. లైవ్ లో ఓ సామాజిక కార్య‌క‌ర్త‌తో మాట్లాడుతూ ఆమెతో జీఎస్టీ తీస్తాన‌ని వ‌ర్మ అన్నార‌ని… అప్పుడు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఒక్క‌రు కూడా ఆయ‌న మాట‌ల‌ను ఖండించిన పాపాన పోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. త‌మ వ‌ర‌కు వ‌స్తే కానీ సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు స్పందించ‌రా… అని ఆమె ప్ర‌శ్నించారు.