ఫస్ట్ మీటింగ్ ఐటీకి నిరాశేనా..?

Software Techies Depressed For Modi First Meeting With Trump

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Software Techies Depressed For Modi First Meeting With Trump

ట్రంప్ అధ్యక్షుడయ్యాక మొదటిసారి సమావేశమౌతున్న ట్రంప్, మోడీలపై భారతీయ ఐటీ పరిశ్రమల చాలా ఆశలు పెట్టుకుంది. కానీ మీటింగ్ కు ముందే షాక్ తింటున్నాయి కంపెనీలు. అసలు వీసాల అంశమే భేటీలో ప్రస్తావనకు రాకపోవచ్చన్న వైట్ హౌస్ ప్రకటన అయోమయాన్ని రేకెత్తించింది. కానీ మన విదేశాంగ శాఖ మాత్రం.. భారతీయుల సమస్యలపై ప్రధాని ట్రంప్ తో మాట్లాడతారని భరోసా ఇస్తోంది.

అమెరికన్లకే ఉద్యోగాలనే నినాదంతో ట్రంప్ తీసుకొచ్చిన వీసా పలసీ ఐటీ పరిశ్రమ నడ్డి విరిచింది అమెరికన్ డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. అసలు అమెరికా పోయే కంటే భారత్ లో ఏదో చిన్న జాబ్ చేసుకుందామని యువత కూడా అనుకుంటున్నారు. కొత్తగా అమెరికా వెళ్దామనుకున్న వాళ్లైతే ఆ ఆలోచనలే మానేస్తున్నారు. దీంతో యూఎస్ లో ట్రంప్ ఉండగా.. జాబ్ వీజీ కాదనే ప్రచారం ఎక్కువైంది. వాస్తవ పరిస్థితి కూడా అలాగే ఉంది.

అందుకే వీసాల పాలసీని సమీక్షించాల్సిందిగా ప్రధాని ట్రంప్ ను కోరతారని ఐటీ అనుకుంది. అయితే ఇప్పటికే వీసాల పాలసీ సమీక్షలో ఉందని వైట్ హౌస్ బాంబ్ పేల్చింది. ప్రస్తుతానికి ఏ దేశం కోసం కూడా రూల్స్ మార్చమని, భవిష్యత్తులో సమీక్ష పూర్తయ్యాక పరిస్థితిని బట్టి చర్చలుంటాయంటోంది. అయితే మోడీ ప్రస్తావిస్తే మాత్రం సమాధానం సిద్ధంగా ఉంచామని చెబుతోంది.